NTV Telugu Site icon

Weather Alert: ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశం

Apweather

Apweather

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. విజయవాడ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రజలు ఇంకా తేరికోకముందే.. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Wolf attacks: మనుషులపై తోడేళ్ల ప్రతీకారం, వాటి పిల్లల్ని చంపినందుకేనా.? యూపీ దాడుల వెనక కారణం..

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం ఎండీ కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Fake Baba: ఇంట్లో దెయ్యం ఉందని.. పూజల పేరుతో 29 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

గత కొద్ది రోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విజయవాడలో బుడమేరు కాల్వ పొంగి నగరం మునిగిపోయింది. దీంతో జనాలు నానా అవస్థలు పడ్డారు. ఇళ్లు మునిగిపోయి.. కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణుగుతున్న తరుణంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. మరోసారి భారీ వర్షాలు కురిస్తే.. ప్రజలు మరిన్ని ఇక్కట్లు ఎదుర్కోవల్సి ఉంటుంది.

Show comments