NTV Telugu Site icon

Konaseema: అష్టదిగ్భందంలో అమలాపురం..!

Police

Police

కోనసీమ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ముఖ్యంగా అమలాపురం అయితే అష్టదిగ్భందంలోకి వెళ్లిపోయింది.. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు.. అయితే, అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుండి భారీగా అమలాపురం చేరుకున్నారు పోలీసులు.. రాత్రి నుంచి అమలాపురంలో వర్షం కూడా కురుస్తుండడంతో.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అక్కడే మకాం వేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏలూరు డీఐజీ పాలరాజు.. ఇవాళ రెండు వర్గాలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా.. పోలీసులు అప్రమత్తం అయ్యారు. బయటవారు అమలాపురంలోకి రాకుండా ఆంక్షలు విధించారు.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

అనుమానితులు ఎవరు పట్టణం వైపు రాకుండా నిఘా పెట్టారు పోలీసులు.. అమలాపురం డిపో నుంచి సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను ప్రయాణీకులు లేకుండానే తిప్పి పంపిస్తున్నారు పోలీసులు.. బస్సుల రద్దు సమాచారం తెలియక డిపోలో పడిగాపులు పడుతున్నారు ప్రయాణికులు, అమలాపురంలో సెక్షన్ 144 కొనసాగుతోంది.. పోలీసుల వలయంలోకి అమలాపురం వెళ్లిపోయింది.. అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఇవాళ ఛలో రావులపాలెంకు కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునివ్వగా.. భారీగా పోలీసులను మోహరించారు.

కాగా, మంగళవారం రోజు అమలాపురం పట్టణం రణరంగంగా మారిన విషయం తెలిసిందే.. కోనసీమ జిల్లా పేరు మార్చడం.. కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో, జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనకు దిగారు.. యువత, జేఏసీ నేతలు పలుమార్లు ఆందోళనలు చేస్తూ వచ్చారు.. ఇక, నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే.