NTV Telugu Site icon

Polavaram Flood Effect: పోలవరంపై గోదారి వరద ప్రభావమెంత?

Polavaram

Polavaram

ప్రపంచంలోనే అతిపెద్దదైన పోలవరం వరద నీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ మొదటి సీజన్ లోనే సమర్థవంతంగా పనిచేసింది. ఈ స్పిల్ వే లోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా అతి తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. ఆకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన గేట్లు విజయవంతంగా అన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేశాయి. మొత్తం 48 గేట్లన్ని ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పనితీరు సమర్థంగా ఉందని నిరూపించడంతో పాటు వరద నీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్ల పాత్ర కీలకంగా మారింది.

గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వస్తున్నాయి.ఇలా గోదారికి వరదలు రావడం 100ఏళ్ళ చరిత్రలో ఇదే మొదటి సారి అని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు.ఐతే ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును ముందస్తుగానే సిద్దంగా ఉంచారు.స్పిల్ వే నుండి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు.స్పిల్ వే లో గతేడాది వరదల సమయానికే 48గేట్లకు గానూ 42రేడియల్ గేట్లు అమర్చడంతో పాటు,వాటిని ఎత్తడానికి అవసరమైన 84హైడ్రాలిక్ సిలిండర్లనూ అమర్చారు.ఇదేవిధంగా 24పవర్ ప్యాక్ సెట్లను సైతం స్పిల్ వే పై అమర్చి గేట్లను ఆపరేట్ చేశారు.

Kakani Govardhan Reddy: పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి నిష్క్రమించాలి

పోలవరం ప్రాజెక్టు లో రేడియల్ గేట్లతో పాటు డెడ్ స్టోరేజి లెవల్ లో రివర్ స్లూయిజ్ గేట్లు ఉంటాయి.మొత్తం 10రివర్ స్లూయిజ్ గేట్లు,వాటికి ఒక్కో గేటుకు రెండు చొప్పున 20హైడ్రాలిక్ సిలిండర్లు,వీటిని ఆపరేట్ చేయడానికి 10 పవర్ ప్యాక్ సెట్లు ఉంటాయి.స్పిల్ వే దగ్గరకు వచ్చిన వరదను ముందుగా రివర్ స్లూయిజ్ గేట్ ద్వారానే విడుదల చేస్తారు.వీటిని గతేడాదే అమర్చి ముందుగా వచ్చిన వరదను ఈగేట్ల ద్వారానే విడుదల చేశారు.రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజి ఉన్న సమయంలో గోదావరి డెల్టాకు త్రాగు,సాగునీరు అందించడానికి ఈగేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు. ప్రపంచంలోనే ఎక్కువ వరద విడుదల చేసే గేట్లు ఇక్కడ వున్నాయి.

పోలవరం స్పిల్ వే లో అమర్చిన 48రేడియల్ గేట్ల ద్వారా 50లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేయడం జరిగంది.చైనాలోని త్రిగార్జెస్ డ్యాం 41లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేవిధంగా డిజైన్ చేస్తే పోలవరం ప్రాజెక్టు లో మాత్రం 50లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని విడుదల చేసేవిధంగా రూపొందించారు.అంతే కాకుండా 100ఏళ్ళ చరిత్రను ఆధారంగా చేసుకుని పోలవరం స్పిల్ వేను,గేట్లను డిజైన్ చేశారు నిపుణులు.వందేళ్ళలో గోదావరికి 36లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను,గేట్లను డిజైన్ చేశారు

ఏదేమైనా పోలవరం ప్రాజెక్టుకు వచ్చే భారీ వరదను తట్టుకుని దిగువకు విడుదల చేసేవిధంగా స్పిల్ వే రేడియల్ గేట్లను పూర్తిస్దాయిలో సిద్దంగా ఉంచడం జరిగింది.ప్రస్తుతం పోలవరం స్పిల్ వే గేట్లనుండి 15లక్షాల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుంది.

భద్రాచలంలో అత్యధికంగా గోదావరి వరద నీటిమట్టం నమోదైన సంవత్సరాలు ఇలా వున్నాయి.

1976- 63.9 అడుగులు
1983- 63.5 అడుగులు
1986-75.6 అడుగులు
1990- 70.8 అడుగులు
1994- 58.6 అడుగులు
1995- 57.6 అడుగులు
2006- 66.9అడుగులు
2010 – 59.7అడుగులు
2013- 61.6 అడుగులు
2014- 56.1 అడుగులు
2022-61.6 అడుగులు

Sunitha Mahender Reddy: జెడ్పి ఛైర్ పర్సన్ వాహనంపై ఎమ్మెల్యే అనుచ‌రుల‌ దాడి