Site icon NTV Telugu

MP Mithun Reddy: నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ..

Mithunreddy

Mithunreddy

MP Mithun Reddy: నేడు సుప్రీంకోర్టులో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించాడు. ఏపీ లిక్కర్ కేసును సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం మొదట ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డి.. అక్కడ, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను కేసు నెం.62గా సుప్రీం ధర్మాసనం లిస్ట్ చేసింది. ఇక, ఈరోజు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై జస్టిస్ జేవీ పార్థివాల, జస్టిస్ ఆర్ మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.

Exit mobile version