Site icon NTV Telugu

బంగ్లాదేశ్ తో కూడా ఇండియా పోటీ పడలేకపోతోంది : హరీష్ రావు

Harish Rao

దేశంలో యాభై శాతం కూడా వృద్ధి లేదని… బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకెళుతోందని..అభివృద్ధిపై కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అబద్ధాలు చెపుతున్నారని హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. వారిది అవగాహన రహిత్యమా ? రాజకీయ లబ్ది కోసమా ? కేంద్రం ఇచ్చిన గణాంకాలే చెప్తున్నా ఇలా మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణ రెట్టింపు వృద్ధి రేటు సాధించిందని… తలసరి ఆదాయం లో కూడా తెలంగాణ ముందుందని స్పష్టం చేశారు. తెలంగాణ వార్షిక వృద్ధి తలసరి ఆదాయం 11.5 గా ఉందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయంలో రెండో స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు వివరించారు. కేసీఆర్ ఉన్నత వరకు టీఆర్ఎస్ దే మొదటి స్థానమన్నారు. ప్రతి పక్షాలకు ఎజెండా లేకుండా పోయిందని… ఇకనైనా గోబెల్స్ ప్రచారం మానుకోవాలని హరీష్ రావు చురకలు అంటించారు.

Exit mobile version