Harirama Jogaiah Wants Pawan Kalyan To Become Chief Minister Of AP: జగన్ పోవాలి.. పవన్ రావాలి అనేదే కాపు సంక్షేమ సేన లక్ష్యమని హరిరామ జోగయ్య తెలిపారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ తరహాలో.. జనసేనకు కేఎస్ఎస్ ఉంటుందని అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన కాపు సంక్షేమ సేన ప్రతినిధుల సమావేశంలో హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. విపక్షాలు కలవాలని చంద్రబాబు అంటారని, కానీ రాజ్యాధికారం వారి చేతుల్లోనే పెట్టాలంటారని అన్నారు. వైసీపీ ఎన్ని వ్యూహాలు రచిస్తోందో.. టీడీపీ కూడా అన్ని రకాల వ్యూహాలు పన్నుతోందని ఆరోపించారు. కన్నా, మహాసేన రాజేష్ లాంటి వారిని జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. జనసేనను చంద్రబాబు వీకెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేవలం 20 సీట్లే జనసేనకు ఇస్తామంటూ చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
Pawan Kalyan: నేను మెత్తగా కన్పిస్తానేమో, కానీ మెత్తటి మనిషిని కాను.. పవన్ వార్నింగ్
ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఎలాంటి ఒప్పందం చేసుకున్నా తామంతా పవన్ వెంటే ఉంటామని హరిరామ జోగయ్య చెప్పారు. అయితే.. పవన్‌కి, కాపుల గౌరవానికి భంగం కలగరాదన్నారు. గౌరవం అంటే సీఎం పదవిలో కూర్చొబెట్టడమేనని స్పష్టతనిచ్చారు. ఎటువంటి మచ్చ లేని వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని.. ఎలాంటి సంకోచం లేకుండా వైసీపీ, టీడీపీలపై పవన్ యుద్దం ప్రకటించాలని సూచించారు. విద్య, ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం సీఎం జగన్‌కు లక్ష పోస్టు కార్డులు రాశామని.. తానే నేనే స్వయంగా నిరాహార దీక్ష కూడా చేశానని.. కానీ ప్రభుత్వం స్పందించలేదని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే వైసీపీ ఇచ్చిందన్నారు. కాపులను కూరలో కరివేపాకులా వాడుకుని రాజకీయ పార్టీలు వదిలేస్తున్నాయని మండిపడ్డారు. 2014లో కాపుల రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రయత్నం చేశారని.. ఆయన చట్టం చేసినా, నిర్లక్ష్యం వహించడం వల్ల అమలు చేయలేదని తెలిపారు. బీసీలకు నష్టం కలగకుంటే.. కాపుల రిజర్వేషన్లకు మద్దతు ఉంటుందని జగన్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. కాపుల ఓట్లు వేయించుకున్నాక.. ఇప్పుడు జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rajinikanth: రాజకీయాల నుంచి అందుకే తప్పుకున్నా.. రజినీకాంత్ క్లారిటీ
ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం మేర రిజర్వేషన్లు కాపులకు ఇవ్వాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల కోటాలోనే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీల కోటాలో కాపు రిజర్వేషన్లను తాము అడగడం లేదన్నారు. పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలన్న కాపుల పట్టుదలని ఎవ్వరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల అభివృద్ధికి తాము అడ్డు కాదన్న ఆయన.. కుల జనగణన జరిగితేనే బీసీల నిష్పత్తి ఎంతో తేలుతుందన్నారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల డిమాండ్లకు తాము అనుకూలంగానే ఉన్నామన్నారు. కాపు కార్పరేషన్‌కు ఏడాదికి రూ.4 కోట్లు ఇవ్వాలని కోరిన హరిరామ జోగయ్య.. కృష్ణా జిల్లాకు రంగా పేరు, కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.