Site icon NTV Telugu

Harirama Jogaiah: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. కాపులపై వైసీపీ చిన్నచూపు..!

Harirama Jogaiah

Harirama Jogaiah

Harirama Jogaiah: ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాపులపై చిన్న చూపుతో వ్యవహరించిందంటున్నారు మాజీ మంత్రి కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య.. శాసనసభ స్థానాలలో రాయలసీమ నుండి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుమారు 15 లక్షల మంది ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక స్థానాన్ని కల్పించారని విమర్శించారు.. రాయలసీమకు చెందిన బలిజ కులస్తులను ఒక్కరికి కూడా టీటీడీలో బోర్డులో సభ్యులుగా సైతం స్థానం కల్పించలేదన్న ఆయన.. జనాభా ప్రాతిపదికన ఈ రోజున కేటాయించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు 18లో కనీసం ముగ్గురు నైనా కాపు అభ్యర్థులను నియమించాలి ఒకే ఒక్క స్థానం మాత్రమే కేటాయించారంటూ తన లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.

Read Also: Akkineni Nagarjuna: ఆ రీమేక్ పైనే నాగ్ ఆశలన్నీ.. వర్క్ అవుట్ అయ్యేనా..?

కాగా, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, మొత్తం 18 స్థానాలకు వైసీపీ ప్రకటించిన అభ్యర్థులను సామాజిక తరగతుల వారీగా చూస్తే.. బీసీలు 11, ఎస్సీలు 2, ఎస్టీ 1, వోసీలకు 4 స్థానాలు కేటాయించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు.. నత్తు రామారావు- శ్రీకాకుళం, లోకల్‌ కోటా (బీసీ, యాదవ), కుడుపూడి సూర్యనారాయణ- తూర్పు గోదావరి, లోకల్‌ కోటా (బీసీ-శెట్టి బలిజ), వంకా రవీంద్రనాథ్‌ – పశ్చిమ గోదావరి,‍ లోకల్‌ ​కోటా (పారిశ్రామికవేత్త), కవురు శ్రీనివాస్‌ – ప.గోదావరి, లోకల్‌ కోటా( బీసీ-శెట్టి బలిజ), మేరుగ మురళి – నెల్లూరు, లోకల్‌ కోటా (ఎస్సీ-మాల), డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం-చిత్తూరు, లోకల్‌ కోటా, రామసుబ్బారెడ్డి – కడప, లోకల్‌ కోటా (ఓసీ-రెడ్డి), డాక్టర్‌ మధుసూదన్‌ – కర్నూలు, లోకల్‌ కోటా (బీసీ-బోయ), ఎస్‌. మంగమ్మ- అనంతపురం, లోకల్‌ కోటా( బీసీ-బోయ).. మరోవైపు.. ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల విషానికి వెళ్తే.. పెనుమత్స సూర్యనారాయణ- విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం) , పోతుల సునీత- ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి) , కోలా గురువులు-విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌), బొమ్మి ఇ‍జ్రాయిల్‌.. తూర్పు గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ), జయమంగళ వెంకటరమణ- ప. గోదావరి, లోకల్‌ కోటా (వడ్డీల సామాజిక వర్గం), ఏసు రత్నం- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర), మర్రి రాజశేఖర్‌- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ), ఇక, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయానికి వస్తే.. కుంభా రవి- అల్లూరి జిల్లా, (ఎస్టీ), కర్రి పద్మశ్రీ- కాకినాడ, (బీసీ)గా ప్రకటించిన విషయం విదితమే.

Exit mobile version