NTV Telugu Site icon

GVL Narasimha Rao: బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. జనసేనతో పొత్తు ఉంది

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao Says BJP Put Special Focus On Telugu States: రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. జనసేనతో తమ పొత్తు ఉందని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన రెండు పార్టీలు కలిసి.. ముందుకు వెళ్లాలనేదే అధినాయకత్వం నిర్ణయమని వెల్లడించారు. విశాఖపట్నంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. పాట్నా వేదికగా విపక్షాల భేటీ తర్వాత, ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసేందుకు సిద్ధం అవుతున్నాయని మండిపడ్డారు.

Actress Jyothi: కేపీ చౌదరి డ్రగ్స్ కేసుపై నటి జ్యోతి రియాక్షన్.. ఆ హక్కు ఎవరిచ్చారు?

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ప్రయత్నం.. ఒక ప్రహసనంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. అవినీతి కూటమి ద్వారా బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఎమర్జెన్సీ నాటి పరుస్థితులను పాఠ్యాంశంగా అందుబాటులోకి తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ నాటి దుర్మార్గ పరిస్థితులు తమకేమీ తెలియదన్నట్టు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ది మూడో స్థానమని వ్యాఖ్యానించిన ఆయన.. 2024 లక్ష్యంగా బీజేపీ దక్షిణాదిలో విస్తరిస్తోందని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఏమాత్రం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ విధించినందుకు.. ప్రతి ఏటా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాలని కోరారు. రాష్ట్రంలో అప్రకటిత పరిస్థితులు, మీడియాపై ఆంక్షలు లేవని క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan: కుల రాజకీయాలతో వ్యవస్థ నాశనమౌతోంది.. జనసేనాని ఫైర్

అంతకుముందు.. వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్లే, ఉత్తరాంధ్ర కరువు ప్రాంతంగా మిగిలిపోయిందంటూ జీవీఎల్ సంచలన ఆరోపణలు చేశారు. ఉచిత పథకాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని, దీనిపై మేధావులే ప్రజల్ని చైతన్యం చేయాలని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిపై తమ స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఏపీలో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ మండిపడ్డారు.

Show comments