NTV Telugu Site icon

GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao Fires On YCP Rahul Gandhi: దళిత క్రిస్టియన్‌లకు ఎస్సీ హోదా కల్పించాలనే వైసీపీ ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న రాజకీయాలని.. ఇలాంటి రాజకీయ ప్రయత్నాలను బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు కూటమి కట్టి.. నైతికత లేకుండా పోరాటాల పేరుతో రోడ్డెక్కుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కోర్టు తీర్పును రాజకీయ పార్టీలు వక్రీకరిస్తున్నాయని విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లిందంటే.. అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేని ఆరోపణలు చేశారు. పరాజయాన్ని జీర్ణించుకోలేకే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నోటి దురుసు, అహంకారంతో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లుగా దూషణలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సామాజిక వర్గమంతా దొంగలు అనడం.. రాహుల్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.

CM Jagan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. పొదుపు సంఘాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచాయి

అంతకుముందు.. ఈసారి తమకు అవకాశం ఇస్తే, సమస్యలను ప్రధాని మోడీకి చూపించి అభివృద్ధి చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని.. ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం ప్రజలు వలస వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో గెలిచిన ఎంపీలు.. ఇక్కడి సమస్యలపై పార్లమెంట్‌లో గానీ, సంబంధిత మంత్రులు గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. అపారమైన వనరులు ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి పెద్దపెద్ద నాయకులు ఎన్నుకోబడినా.. ప్రయోజనం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారని, ఇది దురదృష్టకరమని జీవీఎల్ పేర్కొన్నారు.

Rahul Gandhi: ప్రధాని కళ్లలో భయం చూశా.. అందుకే నాపై అనర్హత వేటు