NTV Telugu Site icon

Lady Aghori: లేడీ అఘోరీపై కేసు..! వశీకరణంతో నా కూతుర్ని తీసుకెళ్లి..!

Lady Aghori

Lady Aghori

Lady Aghori: తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరి హల్‌ చల్‌ చేస్తోంది.. కొన్ని చోట్ల ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి… తన కూతురు శ్రీ వర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య.. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

అయితే, ఇంజినీరింగ్ చదువుతున్న తన కుమార్తె నాలుగు నెలలక్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే.. పోలీసు వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడి అఘోరికి బట్టలు కప్పండి అని చెప్పిన తర్వాత.. తమ కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పిందన్నారు. అప్పటి నుంచి తన కూతురు ఫోన్ నెంబర్ తీసుకొని అఘోరీ మాట్లాడున్నారన్నారు.. కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మాయమాటలతో మోసం చేసి ఆకుపసరుతో లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తారని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడని వాపోయాడు.. ఇప్పుడు తన కూతురు తమ మాట వినటం లేదని లేడీ అఘోరి బ్రమలో ఉన్నదని చెప్పారు.. తమ కుమార్తెను కాపాడాలని పోలీసులకి చెప్పినా కేసు నమోదు చేయటం లేదన్నారు తండ్రి కోటయ్య.