Womens Protest: గుంటూరు ఎస్పీ కార్యాలయం ముందు మహిళల ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు తమపై దాడి చేసి ఇబ్బంది పెట్టారంటూ కోటేశ్వరమ్మ అనే మహిళ ఆమె కూతురుతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమపై దాడి జరిగిందని మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, సీఐ దురుసుగా వ్యవహరిస్తున్నారు అని బాధిత మహిళలు పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు గాని నిందితుల్ని అరెస్టు చేయలేదంటున్నారు. మైనర్ బాలిక దాడి కేసులో నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Read Also: DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ కానుక.. పెరుగనున్న డీఏ..
రోశయ్యతో పాటు మరి కొంత మంది మా మామయ్యపై నాపై నడి రోడ్డులో దాడి చేశారు అని బాధిత మహిళ బంక కొటేశ్వరమ్మ తెలిపింది. మాపై కేసు పెడితే మీకు పథకాలు రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారు.. సెప్టెంబర్ 14వ తేదీన మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. మేము కేసు పెడితే మా పైనే తిరిగి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అనుచరులమని తమను బెదిరిస్తున్నారు.. మమ్మల్ని కొట్టిన వారిని సాక్ష్యం చెప్పకుండా పోలీసులు భయపెడుతున్నారు.. కొట్టిన వారిని అరెస్ట్ చేయకుండా మమ్మల్ని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు అని బాధిత మహిళ ఆరోపించింది.
