Site icon NTV Telugu

Pemmasani: గత ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించ లేదు..

Pemmasani

Pemmasani

Pemmasani: గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు (శనివారం) పలు విభాగాల అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తో మున్సిపల్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశాల్లో కేంద్ర మంత్రి పెమ్మసానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించ లేకపోయిందని విమర్శించారు.

Read Also: Shivraj Singh Chouhan: రైతులకు గుడ్‌న్యూస్.. పలు రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామన్న కేంద్రమంత్రి

ఇక, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. తెనాలి నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకు వచ్చి, ఒక అంచనా ప్రకారం వినియోగిస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులను తీసుకు రావడంలో తన శక్తివంచ లేకుండా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకు వెళుతుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Exit mobile version