NTV Telugu Site icon

Posani Krishna Murali: బెయిల్ వచ్చినా పోసాని విడుదలకు కలగని మోక్షం..!

Posani Krishna Murali

Posani Krishna Murali

Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్‌ వచ్చినా జైలు నుంచి విడుదలకు మోక్షం మాత్రం కలగడంలేదు.. వైసీపీ హయాంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని.. కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ను.. వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించిన వ్యవహారంలో.. పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి.. పీటీ వారెంట్లపై పలు పీఎస్‌లు, కోర్టులు, జైళ్లను తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, ఇప్పటికే కొన్ని కేసుల్లో.. ఈ రోజు సీఐడీ కేసులో బెయిల్‌ రావడంతో.. పోసాని విడుదలకు మార్గం సుగమం అయినట్టు అయ్యింది.. కానీ, పోసాని కృష్ణమురళి జైలు నుండి విడుదల ఇంకా ఆలస్యం అవుతోంది.. గుంటూరు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్‌ వచ్చినా.. జైలు నుండి విడుదలకు మోక్షం కలగడం లేదు..

Read Also: BSNL: ఇక పది రోజులే ఆఫర్.. కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ

అయితే, ఈ రోజు బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం కావడంతో జైలు నుండి పోసాని కృష్ణ మురళి విడుదల కాలేకపోయారు.. రేపు విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు.. మరోవైపు, బెయిల్ వచ్చినా పోసాని కృష్ణమురళి విడుదల అయ్యే వరకు అనుమానమే అంటున్నారు పోసాని సన్నిహితులు.. ఏ క్షణంలో పీటీ వారెంట్‌తో.. ఏ స్టేషన్ పోలీసులు వస్తారో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కానీ, ప్రస్తుతానికి ఎలాంటి కేసులు లేవని చెబుతున్నారు న్యాయవాదులు.. కాగా, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై వివిధ ప్రాంతాల్లో మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి.. అయితే, ఇప్పటికే కొన్ని కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయినా.. మరికొన్ని కేసుల్లో రిమాండ్‌లో ఉండడం.. అన్ని కేసులో బెయిట్‌ దక్కకపోడం.. మరికొన్ని కేసుల్లో 35 (3) Bns ఫాలో అవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. పోసాని జైళ్లలోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది.. అన్ని అనుకున్నట్టుగా జరిగితే రేపు గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల అవుతారని చెబుతున్నారు.