SRM University: ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫుడ్ పాయిజన్ తో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నిన్నరాత్రి విద్యార్దులు యూనివర్సీటీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుని సరైన భోజనం కూడా పెట్టకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని, నిల్వ ఉంచిన గుడ్లు, కూరగాయలు వాడడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. భోజనం బాగోలేదని పలుసార్లు మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్, ఆర్డీవో, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు మంగళగిరి తహశీల్దార్, డీఎస్పీని కమిటీగా నియమించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే..
