Site icon NTV Telugu

Pawan Kalyan: మార్క్ శంకర్ పై అనుచిత వ్యాఖ్యలు.. అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..!

Allu Arjun Fan

Allu Arjun Fan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌పై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్‌ చేసిన వ్యక్తులను పట్టుకున్నారు గుంటూరు పోలీసులు.. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్‌ పుష్పరాజ్‌.. ట్విట్టర్‌ వేదికగా ఈ పోస్ట్‌ చేసినట్టు గుర్తించామని తెలిపారు ఎస్పీ సతీష్‌కుమార్‌.. నిందితుడు రఘు మహిళలపై కూడా చాలా అసభ్యకరమైన పోస్టింగ్‌లు చేసినట్టు.. అతడి సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలిస్తే స్పష్టం అవుతుందన్నారు.. ఇక, నిందితుడు రఘు.. హీరో అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ అని తెలిపారు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మధ్య సోషల్ మీడియా పోస్టుల వార్‌ మధ్యలో.. రఘు అసభ్యకరమైన పోస్టు పెట్టినట్టు గుర్తించామని వెల్లడించారు..

Read Also: Dio 2025 Launche: స్మార్ట్ కీ, యాప్ కనెక్టివిటీతో సరికొత్త “డియో స్కూటర్” విడుదల..

కాగా, సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయాలపాలయ్యాడు.. ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత.. హైదరాబాద్‌ తీసుకొచ్చారు.. ప్రస్తుతం మార్క్‌ శంకర్‌ రెస్ట్‌లో ఉన్నాడు.. అయితే, మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో రఘు అలియాస్ పుష్పరాజ్ అసభ్యకరమైన పోస్టులు పెట్టడం.. దీనిపై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు అందడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు..

Exit mobile version