Minister Satya Kumar: సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమైక్యతా ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, వల్లూరి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఇక, మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలంతా సమైక్యంగా ఉండాలని వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.. 542 సంస్థానాలను విలీనం చేశారు.. హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం తన సంస్థానాన్ని పాక్ లో కలపాలని ప్రయత్నం చేశారు.. దానిని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అడ్డుకున్నారని పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరు అవసరం లేదు
ఇక, సమర్ధవంతమైన నాయకులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయన ఆశయాలను, త్యాగాలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి.. అందుకే ఆయన జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినంగా జరుపుకుంటున్నాం.. సంక్షేమమే లక్ష్యంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు.. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారని సత్యకుమార్ చెప్పుకొచ్చారు.
