Ambati Rambabu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు పెట్టారు పోలీసులు.. అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించిన వైసీపీ ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.. అయితే, ర్యాలీగా వస్తున్న అంబటిని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దీంతో, సీఐపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అయితే, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, బెదిరించడమే కాకుండా దూషించడంపై ఆయా సెక్షన్ల కింద అంబటి రాంబాబు కేసు నమోదు చేశారు. అంబటితోపాటు ఆయన అనుచరుడు వినోద్ మరి కొంత మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు పట్టాభిపురం పోలీసులు.. కాగా, వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు, సీఐ గంగా వెంకటేశ్వర్లు మధ్య జరిగిన వాగ్వాదం.. పరస్పరం వార్నింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయిన విషయం విదితమే..
Read Also: Srisailam: శ్రీశైలం ఆలయంలో మరోసారి భారీగా బదిలీలు..
