Site icon NTV Telugu

Guntur Crime: మరో మైనర్‌ బాలిక హత్య.. కూల్‌ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి..!

Crime

Crime

Guntur Crime: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారుల హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టిస్తోన్న తరుణంలో.. ఇప్పుడు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మరో మైనర్ బాలిక హత్య కలకం రేపుతోంది.. స్థానికంగా ఉంటున్న నాగరాజు అనే వ్యక్తి హత్య చేశాడని.. బాధితు కుటుంబం, బంధువులు ఆరోపిస్తున్నారు.. వేరే ప్రాంతం నుండి వలస వచ్చి కొత్తరెడ్డి పాలెంలో గ్యాస్ గోడౌన్ లో పని చేస్తున్న నాగరాజుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి మైనర్ బాలికను అపహరించి ఉంటాడని అనుమానాన్ని వెలిబుచ్చుతున్నారు..

Read Also: Low BP vs High BP: అసలు ఈ లోబీపీ, హైబీపీ మధ్య తేడా ఏంటి..

అయితే, నాగరాజు ఉంటున్న ఇంట్లోనే మైనర్ బాలిక మరణించి పడి ఉండడాన్ని చూసి షాన్‌ తిన్నారు స్థానికులు.. ఇదంతా నాగరాజు పనేనని.. అతడే చిన్నారిని అపహరించి.. ఏదో చేసి.. హత్య చేశాడని అనుమానిస్తున్నారు.. దీంతో నాగరాజు నీ కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు.. నిందితుడు నాగరాజుని బహిరంగంగా శిక్షించకపోతే.. బాలిక మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమే.. ఆ దుర్మార్గుడికి శిక్ష పడిన తర్వాతే బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తాం.. అప్పటి వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని.. గ్రామస్తులు, బాలిక బంధువులు బైఠాయించారు. ఇక, ప్రస్తుతం నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. నాగరాజును పట్టుకునేందుకు ప్రత్యక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.

Exit mobile version