ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు వేగవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని మంత్రి లోకేష్ చెప్పారు.. ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యేవరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్‌లు ఇవ్వకూడదని అన్నారు. తమ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆగష్టు 1న సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.. ఎస్సీ వర్గీకరణ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు తీసుకు వచ్చారని మందకృష్ణ పేర్కొన్నారు.
Read Also: Double Ismart: టీవీలోకి డబుల్ ఇస్మార్ట్.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?
2006లో ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చింది పంజాబ్‌లోనని మందకృష్ణ మాదిగ అన్నారు. 2009లో తమిళనాడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా చట్టం తెచ్చారు.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో లాయర్‌ను నియమించలేదన్నారు. రాష్ట్రంలో ఇంత వరకు ఎస్సీ వర్గీకరణ ప్రారంభం కాలేదు.. మిగతా రెండు రాష్ట్రాల్లో అమలులో ఉందని చెప్పారు. మరో మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు ముందుకు వచ్చాయని అన్నారు. వర్గీకరణ లేని రాష్ట్రల్లో హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ ముందుకు సాగుతుందని తెలిపారు.
Read Also: Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. కీలక ఆధారాలు స్వాధీనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యే వరకు ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వమని తెలిపిందని మందకృష్ణ మాదిగ అన్నారు. జగన్ ప్రభుత్వం అప్పట్లో ఎస్సీ వర్గీకరణ జరగకముందే నోటిఫికేషన్లు ఇచ్చారు.. గత జగన్ పాలనలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్‌లో కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింప చేయాలని కోరారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి మాదిగలు శక్తి వంచన లేకుండా పని చేసారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.