Site icon NTV Telugu

Student Suicide: మీనాక్షికి పదే పదే ఫోన్ చేసిన రహీం.. ఉరేసుకుని యువతి సూసైడ్

Gnt

Gnt

Student Suicide: గుంటూరు జిల్లాలోని పోలకం పాడు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న పోలూరు మీనాక్షి అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మీనాక్షికి అదే కాలేజీలో చదివే రహీం అనే సీనియర్‌తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం క్రమంగా వేధింపులుగా మారిందని ఆరోపించారు. తరచూ ఫోన్ చేసి మాట్లాడాలని, రూముకు రావాలని ఒత్తిడి చేస్తూ, అలా చేయకపోతే తన దగ్గర ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని రహీం బెదిరించినట్లు మీనాక్షి తండ్రి చెప్పారు.

Read Also: Taliban-Domestic Violence: భార్యను చితకబాదే హక్కు.. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు బహిరంగ శిక్షలు!

అంతేకాదు, ఆ ఫొటోలను మీ తల్లిదండ్రులకు పంపిస్తానని కూడా మీనాక్షి బెదిరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన మీనాక్షి, మొన్న రాత్రి అన్ని విషయాలను మాకు చెప్పింది, “ఇక నా వల్ల కాదమ్మా, నేను చనిపోతాను” అని బాధతో చెప్పినట్లు ఆమె తల్లి వాపోయింది. అనంతరం తల్లిదండ్రులు పనుల కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మీనాక్షి కనిపించిందన్నారు.

Read Also: Neal Katyal: ట్రంప్‌నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..

ఇక, రహీం అనే వ్యక్తి బెదిరింపులు, ర్యాగింగ్ తట్టుకోలేకే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని మీనాక్షి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తన కుమార్తె భవిష్యత్తు కోసం విమానాశ్రయంలో ఉద్యోగానికి ట్రైనింగ్ కి పంపించాలని కూడా అనుకున్నాను, కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Exit mobile version