Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Car Fire: ఆస్పత్రికి వెళ్లి వైద్యులు అందుబాటులో లేకపోవడం ఇంటికి తిరుగు ప్రయాణం అయిన తండ్రీ కొడుకులు అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు.. తండ్రీ మృతి చెందగా.. కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ఐపీడీ కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న తాడికొండ హరికృష్ణ అనే వృద్ధుడు సజీవదహనమయ్యారు. ఆయన కుమారుడు అఖిలేష్‌కు గాయాలయ్యాయి.
హరికృష్ణను ఆయన కుమారుడు అఖిలేష్ డయాలసిస్ కోసం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తండ్రి, కొడుకులు కారులో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి సమీపంలోకి చేరుకున్న సమయంలో కారులోని ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో హరికృష్ణ కారులోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అఖిలేష్‌కు గాయాలు కావడంతో స్థానికులు కారులో నుంచి బయటకు లాగి కాపాడారు. ఐపీడీ కాలనీలో కారు మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయి, ఏసీ పేలడమే కారణమా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
తాజావార్తలు
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!