Site icon NTV Telugu

AP Capital: రాజధాని విస్తరణకోసం రెండో విడత గ్రామసభ.. ఎమ్మెల్యే, అధికారులకు‌ నిరసన సెగ

Farmers Protest

Farmers Protest

AP Capital: ఓవైపు రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల్లో వేగం పెంచిన కూటమి ప్రభుత్వం.. మరోవైపు, రాజధాని విస్తరణపై కూడా దృష్టి సారించింది.. దీనిలో భాగంగా రాజధాని కోసం భూ సమీకరణకు నడుం బిగించింది.. రాజధాని కోసం తీసుకోవాలని భావిస్తోన్న గుంటూరు జిల్లాలోని ఆయా గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు.. అయితే, రాజధాని విస్తరణకోసం రెండో విడత గ్రామసభలో అధికారులకు ‌నిరసన సెగ తాకింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారుల ఎదుట నిరసనకు దిగారు స్థానికులు.. గ్రామ సభ నిర్వహించడానికి వీల్లేదంటూ పొన్నెకల్లులో రైతులు ఆందోళనకు దిగారు.. ఎమ్మెల్యే, అధికారులు.. గో బ్యాక్.. గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు.. దీంతో, తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామసభ ఉద్రిక్తంగా మారిపోయింది..

Read Also: Rahul Gandi: ట్రంప్ సుంకాలకు మోడీ తలవంచుతారు.. రాసి పెట్టుకోవాలన్న రాహుల్‌గాంధీ

Exit mobile version