NTV Telugu Site icon

Alapati Rajendra Prasad: కూటమి తరపుపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్

Alapati Raja

Alapati Raja

Alapati Rajendra Prasad: గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మీకి అందించారు. ఇక, ఆలపాటి రాజా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే, మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథితో పాటు మాజీ మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, కామినేని శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ఎన్డీయే కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

Read Also: Sailajanath Joins YSRCP: జగన్ సమక్షంలో వైసీపీ గూటికి మాజీ మంత్రి శైలజానాథ్..

ఇక, మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. ఆలపాటి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సరైన నాయకుడు.. అందుకే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.. అధోగతి పాలైన రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి బాటలో పెడుతున్నారు.. ఉద్యోగ అవకాశాలు, రైతాంగ ప్రోత్సాహకాలు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుతం.. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం చరిత్రలో లికించ బడిందని ఆయన మండిపడ్డారు. జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు. 2.0లో ఇంకేం జరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారు.. ఒక అపోహలో జగన్ జీవిస్తుంటారు.. 175 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు.. ఫలితాలు ఎలా ఉన్నాయే చూసి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారంటూ మంత్రి పార్థసారథి విరుచుకుపడ్డారు.