Site icon NTV Telugu

Nandigam Suresh: వైసీపీకి షాక్.. మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Nandigama Suresh

Nandigama Suresh

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లురు పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ తనపై దాడి చేశాడని టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగం సురేష్ స్వగ్రామం ఉద్దండరాయునిపాలెంలో మాజీ ఎంపీ సురేష్ ఇంటి దగ్గర గొడవ జరిగింది.

Read Also: KTR: ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ కీలక ఆదేశం..

ఇక, టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడి చేశాడు. గాయపడిన బాధితుడు మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సురేష్‌ ను అదుపులోకి తీసుకోగా.. ఆయన సోదరుడితో పాటు కేసులో ఉన్న వారి బంధువుల కోసం గాలిస్తున్నారు.

Exit mobile version