Site icon NTV Telugu

Harsha Kumar: తురకపాలెం లో ఏదో జరుగుతోంది.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలి..

Harshakumar

Harshakumar

Harsha Kumar: గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏదో జరుగుతోంది.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్‌.. తురకపాలెం మెడికల్ క్యాంప్‌కు వచ్చిన హర్షకుమార్.. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్న హర్షకుమార్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తురకపాలెం మరణాలకు కారణాలు డాక్టర్లు చెప్పలేక పోతున్నారు.. ఐసీఎంఆర్ టీంలు వచ్చినా కారణాలు తేలలేదు. దళితులు ఉన్న ప్రాంతాలలోనే మరణాలు సంభవించాయి అని ఆరోపించారు… దొంగసారా వల్ల మరణాలు జరిగాయి అని గ్రామస్థులు అంటున్నారు. కొందరు నాయకులు దొంగ సారాకు కారణమయ్యారు. వారెవరో ప్రభుత్వం విచారించాలని కోరారు.. అయితే, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత మరణాలు సంభవించ లేదు.. కానీ, గ్రామంలో ఏదో జరుగుతోది… ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కోరారు మాజీ ఎంపీ హర్షకుమార్‌…

Read Also: Amazon Sale 2025: ఇది కదా డీల్ అంటే.. షావోమీ 14 సీవీపై 17 వేల తగ్గింపు!

కాగా, గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలు సంచలనంగా మారాయి.. మరణాల వెనుక ఉన్న మిస్టరీ చేధించేందుకు ఇప్పటికే గ్రామంలో పర్యటించిన పలు జాతీయ సంస్థలు అక్కడి శాంపిల్స్‌ సేకరించాయి.. నివేదికలు సిద్ధం చేసే పనిలో పడిపోయాయి.. ఎయిమ్స్, ఐసీఏఆర్, NCDC, NHC బృందాలు గ్రామంలో పర్యటించాయి. కేవలం 4 నెలల వ్యవధిలో 40 మంది గ్రామస్తులు మృతిచెందడం ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.. జులైలో 10, ఆగస్టులో 10, సెప్టెంబర్ ప్రారంభంలో 3 మరణాలు.. ఇలా ఇప్పటికే 40 మంది మృతిచెందారు.. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆస్పత్రుల్లో చేరడం.. అక్కడే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి.. ముఖ్యంగా ఎస్సీ కాలనీలోనే ఎక్కువగా మరణాలు నమోదు కావడంతో దీనిపై మూఢనమ్మకాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి..

Exit mobile version