NTV Telugu Site icon

Pawan Kalyan: సింగపూర్ దౌత్యాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం..

Pawan Kalyan

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్‌తో భేటీ అయ్యారు. ఉదయం మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు.. పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృద్ధి, అవకాశాలను అన్వేషించే మార్గాలు తదితర అంశాలపై చర్చించారు.

Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు కాసుల వర్షం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం.. సింగపూర్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య సుదీర్ఘ మైత్రి ఉందని పేర్కొంది. ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతం దిశగా ఈ భేటీ జరగడం అభినందనీయమని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ తెలిపారు.

Read Also: Dog Attack: దారుణం.. వృద్ధురాలిపై వీధి కుక్కల గుంపు దాడి..