Ramakrishna: ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చెయ్యడం సిగ్గుచేటని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేదలకు న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలు మాట్లాడడకపోవడం దారుణమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ స్పీడుతో ప్రభుత్వ రంగంసంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు..
గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సులో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటీకరణ చేసేందుకు అధికారంలోకి వచ్చినట్లు ఉన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏపీలో ఉన్న దౌర్భాగ్య పాలన లేదన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు చేసుకున్న పాపమని మండిపడ్డారు.. కూటమి పాలనలో అన్ని రంగాలు వ్యవస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయి. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటు అన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు మెడికల్ కళాశాలలో అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసిందని విమర్శించారు.. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని గ్యారెంటీ ఏంటి.? అని ప్రశ్నించారు.. అనేకమంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన ప్రత్యక్షంగా.. పరోక్షంగా వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
