Site icon NTV Telugu

Constable Chiranjeevi Wife: నా భర్తపై దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయారు..? దళిత సంఘాలకు కానిస్టేబుల్‌ భార్య ప్రశ్న

Constable Chiranjeevi

Constable Chiranjeevi

Constable Chiranjeevi Wife: తన భర్తపై రౌడీషీటర్లు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తే కులసంఘాలు ఎక్కడికిపోయాయని మండిపడ్డారు కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి.. గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవిపై నెల రోజుల క్రితం ఐతానగర్ కు చెందిన రౌడీషీటర్ లడ్డూ అనుచరులు జాన్ విక్టర్, బాబూలాల్, రాకేష్ లు గంజాయి మత్తులో దాడి చేశారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన ప్రాంతంలోనే రౌడీషీటర్ అనుచరులు జాన్ విక్టర్, బాబూలాల్, రాకేష్ లకు పోలీసులు నడిరోడ్డుపైనే అరికాలి కోటింగ్ ఇచ్చారు.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులపై విమర్శలు కూడా వచ్చాయి.. ఇక, పోలీసుల తీరుపై కులసంఘాలు మండిపడ్డాయి. కొందరు రాజకీయ నేతలు కూడా ఇదేం అంటూ ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు.. అయితే, దీనిపై కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి స్పందించారు.. తాను ఎస్సీ అని, చిరంజీవితాను పదేళ్లక్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నారు. తన భర్తపై దాడి చేస్తే కులసంఘాలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు… రౌడీషీటర్ల వల్ల నా భర్తకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు..? కానిస్టేబుల్ చిరంజీవి భార్య కల్యాణి..

Read Also: BCCI: అప్పుడు తొలగించింది.. ఇప్పుడు మరలా అపాయింట్ చేసుకుంది!

Exit mobile version