తన భర్తపై రౌడీషీటర్లు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తే కులసంఘాలు ఎక్కడికిపోయాయని మండిపడ్డారు కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి.. గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవిపై నెల రోజుల క్రితం ఐతానగర్ కు చెందిన రౌడీషీటర్ లడ్డూ అనుచరులు జాన్ విక్టర్, బాబూలాల్, రాకేష్ లు గంజాయి మత్తులో దాడి చేశారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.