Site icon NTV Telugu

CM Chandrababu: నేడు అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..

Babu

Babu

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ( ఏప్రిల్ 14న ) గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై భేటీ కానున్నారు. ఇక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేడ్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు.

Read Also: SC Categorization: నేడే ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల

ఇక, సాంఘిక సంక్షేమ వసతి గృహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, అంబేడ్కర్ విద్యా పథకం కింద రుణాలు తీసుకుని చదువుకున్న స్టూడెంట్స్ తో వర్చువల్ సమావేశంలో సీఎం మాట్లాడనున్నారు. దీంతో పాటు పీ- 4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి – బంగారు కుటుంబాలతో సుమారు రెండు గంటల పాటు ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అనంతరం తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఈ మీటింగులో టీడీపీ కేడర్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

Exit mobile version