CM Chandrababu: గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. సైన్స్‌కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అన్నారు.. 2000 సంవత్సరంలో నెల్లూరులో మొదటి హాస్పిటల్ నేనే ప్రారంభించాను.. 25 సంవత్సరాలలో 25 వేల కోట్ల టర్నోవర్ సాధించన హాస్పిటల్ గా కిమ్స్ హాస్పిటల్ రూపాంతరం చెందింది.. 5000 పడకల హాస్పిటల్ చైన్ గా కిమ్స్ తయారు అయ్యింది అని ప్రశంసలు కురిపించారు.. ప్రజల ఆరోగ్యం కోసం వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు.. టెక్నాలజీ భవిష్యత్ ను మారుస్తుందని 95 లోనే చెప్పాను.. మళ్లీ చెప్తున్నా, రాబోయే కాలాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ శాసిస్తుంది… మన ఆస్తి ఎంత అని కాదు.. మన దగ్గర ఎంత డేటా ఉందని ఆలోచించాలి.. సైన్స్ కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు చేయవచ్చు… టెక్నాలజీతో సామాన్య వైద్యులు కూడా అద్భుతంగా ఆపరేషన్ లు చేయవచ్చు అని సూచించారు.
Read Also: Ruhii Siingh : అదిరే అందాలతో.. అలాంటి పోజులతో కుర్రకారును కవ్విస్తున్న రూహి సింగ్
ఒకప్పుడు ఎన్టీఆర్ అమెరికా వెళ్లి హార్ట్ సర్జరీ చేపించుకున్నారు.. ఇప్పుడు అనేక హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తున్నాయి అన్నారు చంద్రబాబు.. మన లైఫ్ స్టైల్ తో మన ఆరోగ్యం ముడి పడి ఉంది.. రాష్ట్రంలో 90 శాతం వచ్చే అనారోగ్యాలు ఏంటి అనే డేటా చూడాలి.. నేచురల్ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని సూచించారు.. ప్రకృతి ఆహార పదార్థాలు పండించే రాష్ట్రంగా ప్రపంచం లో ఏపీ నిలవాలని ఆకాక్షించారు.. ఇక, మీరు ఏ ఆఫీసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు.. వాట్సాప్ లో అన్ని సేవలు అందుతాయి.. ప్రభుత్వ పాలనలో ఆధునిక విధానాలు తీసుకు వస్తాం.. స్వర్ణాంధ్ర, వికసిత భారత్ ను అనుసందానం చేసుకుని ముందుకు వెళ్తాం అన్నారు..
Read Also: Bihar: బీహార్‌పై ఫోకస్ పెట్టిన బీజేపీ! ఎన్ని సీట్లు లక్ష్యమంటే..!?
అయితే, మెడికల్ కాస్ట్ తగ్గాలి.. మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయి.. వైద్య ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు.. వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో, సమాజ సేవ కూడా అంతే ముఖ్యం అన్నారు చంద్రబాబు.. అనవసరంగా హాస్పిటల్ లో ఉంచి రూం బిల్లులు వసూలు చేసే విధానం మారాలి.. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా, అవసరమైతేనే హాస్పిటల్ కు పేషంట్ ను తరలించే పరిస్థితి రావాలి.. మెడికల్ విభాగంలో స్కిల్ డెవలప్మెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమర్ధవంతమైన నాయకుడు, నరేంద్రమోడీ కేంద్రంలో ప్రధాని గా ఉన్నారు.. 2004 లో 2019లో టీడీపీ గెలిచి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు.. 1618 కోట్ల తో ఎయిమ్స్ నిర్మాణం చేశారు.. 900 పడకల హాస్పిటల్ కు తాగు నీరు లేకుండా చేశారు.. పక్కన కృష్ణ నది, ప్రకాశం బ్యారేజ్ పెట్టుకుని నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం గతంలో పాలన చేసిందని ఫైర్ అయ్యారు.. పాలన పై ప్రజల నుండి సమాచారం తీసుకోవాలి.. రాజుల కాలంలో వేగులతో , మారు వేషాల్లో రాజులే ప్రజా అభిప్రాయం సేకరించేవాళ్ళు.. మాకు ఆ అవకాశం లేదు.. అందరూ గుర్తు పడతారు.. అందుకే వెళ్ళలేక పోతున్నా.. కానీ, టెక్నాలజీ సాయంతో మారు మూల గ్రామాల ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..