Site icon NTV Telugu

Chinta Mohan: ప్రతిపక్షాలు టార్గెట్‌గానే ఆర్టికల్‌ 130..!

Chinta Mohan

Chinta Mohan

Chinta Mohan: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్130 ప్రతిపక్షాలను నిర్మూలించేందుకేనని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. దేశంలో అనేకమంది సీఎంలపై కేసులున్నాయన్నాయని గుర్తుచేశారు.. ఇక, ఇరాన్, రష్యాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాం.. ఇరాన్ కంటే 70 శాతం తక్కువ ధరకు రష్యా చమురు ఇండియాకు సరఫరా చేస్తున్నారు… అసలు రష్యా నుంచి తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న చమురును‌ ఎవరికి దోచిపెడుతున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు.. బ్యాంకులు రైతులకు కేవలం 5 శాతం, పెద్దవారికి 95 శాతం రుణాలు ఇస్తున్నారు. పదకొండేళ్లలో 14.5 లక్షల కోట్లు రుణమాఫీలో పది శాతం‌ కమిషన్ బీజేపీ నాయకులకు చేరిందని ఆరోపించారు..

Read Also: Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. మెట్రో సేవలు లేక ప్రయాణికులతో కిక్కిరిసిన స్టేషన్లు

మరోవైపు, నేడు రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు చింతా మోహన్.. అమరావతి దేవతల రాజధాని కాదని… నీళ్ల రాజధాని అని ముందే చెప్పానని గుర్తుచేశారు. ఐఏస్ అధికారి శ్రీలక్ష్మిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. గత రెండు ఎన్నికలలో 115 పార్లమెంట్ స్థానాల్లో ఓట్లచోరీ జరిగిందని విమర్శించారు.. ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలే నియమించి, దొంగ ఓట్లు చేర్చుకుని లబ్ది పొందుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌..

Exit mobile version