NTV Telugu Site icon

Baby Girl Sale: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కలకలం.. రూ.1.90 లక్షలకు చిన్నారి విక్రయం..

Baby Girl Sale

Baby Girl Sale

Baby Girl Sale: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి విక్రయం ఘటన కలకలం సృష్టించింది.. 1.90 లక్షల రూపాయలకు తన బిడ్డను విక్రయించారు చిన్నగంజాంకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి.. కొద్ది రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తన భార్య లక్ష్మిని డెలివరీ కోసం తీసుకెళ్లాడు భర్త సుబ్రహ్మణ్యం.. అయితే, ఆడ శిశువుకు జన్మనిచ్చిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి కన్నుమూసింది.. గతంలోనే లక్ష్మికి ఎనిమిది మంది సంతానం ఉంది.. మరోవైపు.. అదే ఆస్పత్రిలో డెలివరీ కోసం భట్టిప్రోలుకు చెందిన మీరాభి చేరింది.. కానీ, డెలివరీ తర్వాత మీరాభికి పుట్టిన శిశువు ప్రాణాలు విడిచింది.. అదే సమయంలో మీరాభి స్నేహితురాలు ప్రభావతి.. సుబ్రమణ్యంతో చిన్నారి కోసం సంప్రదింపులు జరిపింది.. ఇక, తన పాపను ఇచ్చేందుకు సుబ్రమణ్యం అంగీకరించారు.. ఈ నెల 7వ తేదీన సుబ్రహ్మణ్యాన్ని ఒప్పించి శిశువును తీసుకువెళ్లేందుకు చిన్నగంజాంకు వచ్చింది మీరాభి కుటుంబ సభ్యులు.. ఎట్టకేలకు సుబ్రహ్మణ్యాన్ని ఒప్పించి శిశువుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు మీరాభి కుటుంబ సభ్యులు.

Read Also: Manipur : మణిపూర్లో మళ్లీ కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిషేధం.. 2000మంది సైనికుల మోహరింపు

బిడ్డ పుట్టి చనిపోవడంతో, తీవ్ర మనోవేదనలో ఉన్న తన మిత్రురాలు మీరాభికి సుబ్రహ్మణ్యం వద్ద కొనుగోలు చేసిన శిశువును తీసుకువచ్చి ఇచ్చింది స్నేహితురాలు ప్రభావతి.. అయితే, బిడ్డ పుట్టి చనిపోయిన మహిళ వద్ద మరో బిడ్డను చూసి అనుమానం వచ్చి ప్రశ్నించారు జీజీహెచ్‌ సిబ్బంది.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. ఇక, పోలీసుల విచారణను బిడ్డను 1.90 లక్షలకు కొనుగోలు చేసినట్లు ప్రభావతి ఒప్పుకుంది.. శిశువు కొనుగోలుపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును చినగంజం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు కొత్తపేట పోలీసులు.. మొత్తంగా తన తనకు పుట్టిన బిడ్డ కన్నుమూయడంతో.. తీవ్ర మనోవేధనతో ఉన్న స్నేహితురాలిని ఓదార్చేందుకు ప్రభావతి ప్రయత్నించింది.. ఇప్పుడు పోలీసు కేసులు చిక్కుకుంది.

Show comments