Guntur Police: గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన రౌడీషీటర్ అనుచరులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నెల రోజుల క్రితం ఐతానగర్‌లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడిచేశారు రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు విక్టర్, బాబూలాల్, రాకేష్.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు తెనాలి టూ టౌన్ పోలీసులు. నిందితులను ఐతానగర్ తీసుకెళ్లి నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు పోలీసులు. అయితే, పోలీసులు ఇలా నడిరోడ్డుపై నిందితులకు కోటింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. కొందరు పాజిటివ్‌గా.. మరికొందరు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.. ఇక, బాధిత ఎస్సీ యువకులని నడి రోడ్డుపై చితక్కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. నడి రోడ్డుపై రౌడీ ముకాలకు పోలీసులు ఇచ్చిన ఆ కోటింగ్ వీడియోను ఈ కింది వీడియోలో చూడవచ్చు..
Guntur Police: పోలీసులపై దాడి చేస్తే ఇలా ఉంటది మరి.. నిందితులకు నడిరోడ్డుపై కోటింగ్..!
- తెనాలిలో రౌడీషీటర్ అనుచరుల తాట తీసిన పోలీసులు..
- నెల రోజుల క్రితం ఐతానగర్‌లో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి..
- గంజాయి మత్తులో కానిస్టేబుల్‌పై దాడి చేసిన విక్టర్, బాబూలాల్, రాకేష్..
- కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు.. నడిరోడ్డుపై కోటింగ్..

Guntur Police