Ambati Rambabu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. ఒక్క కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో రిమాండ్ అన్నట్టుగా తయారు అయ్యింది అంబటి రాంబాబు పరిస్థితి.. అంబటి రాంబాబుకు మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు.. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు విక్రయించారని జనసేన ఫిర్యాదు చేయగా.. 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో అంబటి రాంబాబుకు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం.. దీంతో, మరోసారి రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు తరలించారు పోలీసులు..
Read Also: Mahindra Udo: మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా.. తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..
కాగా, సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. 2023 సంక్రాంతి పండుగ సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా ప్రజలకు టికెట్లు అంటగట్టారని జనసేన నేతలు ఆరోపించడమే కాకుండా.. పోలీసులకు పిర్యాదు చేశారు.. ప్రజలను బెదిరించి టికెట్లు కొనిపించారని, ఇది చట్టవిరుద్ధమని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.. ఇక, జనసేన నేతల ఫిర్యాదు మేరకు అంబటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. అంబటిపై ఉన్న పీటీ వారెంట్ కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఇక, కోర్టులో హాజరుపరిచిన తర్వాత.. ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి..
