NTV Telugu Site icon

Ambati Rambabu: మూడు రాజధానులపై త్వరలో మా స్టాండ్‌ చెబుతాం.. అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు

Ambatirambabu

Ambatirambabu

Ambati Rambabu: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్రంలో మూడు రాజధానులే మా విధానం అని స్పష్టం చేసింది.. అమరావతిని శాసన రాజధానిని చేసి.. విశాఖను పరిపాలన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొన్నారు.. ఆ దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసింది.. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది.. ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్‌ ఏంటి? నే చర్చ సాగుతుండగా.. మూడు రాజధానులపై మా స్టాండ్ ఏంటో త్వరలో చెప్తాం అన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. దీంతో, మూడు రాజధానులపై వైసీపీ మళ్లీ కొత్త స్టాండ్‌ తీసుకోనుందా? అనే చర్చ సాగుతోంది.. మరోవైపు, చంద్రబాబు దగ్గర రెడ్ బుక్ ఉన్నంతవరకు వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు అంబటి.. ఇక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిల దృష్ట్యా నూతన నగరాలు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు అన్నారు.. రాజకీయాలలో సీనియర్ అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు నిలకడ లేదు.. ఏ పార్టీలో చేరితే ఆ పాట పాడటం డొక్కాకు అలవాటు అని ఫైర్‌ అయ్యారో.. అయితే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఏ జ్వరం వచ్చిందో నాకు తెలియదు అంటూ సెటైర్లు వేశారు.

Read Also: Sharad Pawar : 20ఏళ్ల తర్వాత బీహార్ లోకి ఎంట్రీ ఇస్తున్న శరద్ పవార్

అన్యాయాలు, అక్రమాలతో నిర్మించే రాజకీయ కోటలు కూలి పోతాయి.. జగన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు మీడియా ముఖంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు అంబటి.. వైసీపీ నుండి వెళ్లిన వారు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. మార్కులు కొట్టేయాలని ముందుకు దూకుతున్నారు.. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. 26 వేల కోట్లు తెచ్చి రాజధాని నిర్మిస్తారట… కూటమి నాయకులు చెప్పే ప్రచారం వేరు… చేసే పనులు వేరన్నారు.. ప్రభుత్వం ఆదాయం తగ్గిపోయింది అంటారు.. జీడీపీ పెరిగి పోయింది అంటున్నారు.. అది ఎలా సాధ్యమో కూటమి నాయకులు చెప్పాలని నిలదీశారు.. గతంలో వైసీపీ పాలనలో జగన్ బటన్ నొక్కి కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకు అకౌంట్ లో వేశారు.. సంపద సృష్టి స్తా అని చెప్పిన చంద్రబాబు, బటన్ లు ఎందుకు నొక్కడం లేదు..? అని నిలదీశారు.

Read Also: Steve Smith: స్మిత్ సెంచరీల పరంపర.. ద్రవిడ్, జోరూట్ రికార్డులు సమం

ఇక, ఎంపీ మిథున్ రెడ్డికి.. లిక్కర్ స్కాంకి ఏంటి సంబంధం.. మిథున్ రెడ్డి ఎక్సైజ్ మంత్రి గా చేశారా..? అని ప్రశ్నించారు అంబటి.. ఉద్యోగులకు మొదటి వారంలో జీతాలు పడటం లేదు.. ఉద్యోగాల కల్పన లేదు.. దావూస్ వెళ్లినా రెడ్ బుక్ గురించి ప్రచారమే.. జగన్ అధికారంలోకి వస్తారన్న భయంతో తట్టల తట్టల అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.. చెత్తగా మాట్లాడితే ప్రజలు నిన్ను చిత్తు చిత్తు గా ఓడిస్తారు అని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లతో టీడీపీ నాయకులకు భయం పట్టుకుంది.. కూటమి ప్రభుత్వం ప్రజలను చేస్తున్న మోసాలను, వాస్తవాలను ప్రజలకు చెప్పారు.. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అనేక అసత్య ప్రచారాలు చేశారు.. అప్పుడు జగన్ ను విమర్శించిన వాళ్లు ఇప్పుడు కూడా విమర్శిస్తూనే ఉన్నారు.. అధికారంలోకి రావడానికి చంద్రబాబు అనేక అబద్ధాలు ప్రజలకు చెప్పారు.. ఇప్పుడు ఆ ఆసాధ్యమైన వాగ్దానాలు అమలు చేయలేక రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని చెప్తున్నారు. జగన్ చేయలేని పనులు ఎప్పుడూ చెప్పరు.. మానిఫెస్టో లో పెట్టిన 99 శాతం వాగ్దానాలు వైసీపీ అమలు చేసిందని స్పష్టం చేశారు.. కూటమి నాయకులు వాగ్దానాలు అమలు చేయక పొతే కాలర్ పట్టుకుని అడగమన్నారు.. ఇప్పుడు ప్రజలు ఎవరి చొక్కా పట్టుకుని అడగాలి చెప్పండి అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..