శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిని హత్య చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఈ మేరకు సర్పంచ్‌పై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే… మంగళవారం రాత్రి మరురానగర్‌లోని సర్పంచ్ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది.
Read Also: గుడ్ న్యూస్… ఏపీలో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
సర్పంచ్‌తో మహిళ మాట్లాడుతున్న సమయంలో… ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకీతో సర్పంచ్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వెంకటరమణకు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో పోలీసులకు రెండు బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించారు.