Illegal Affair: వీడిన మిస్టరీ.. మైనర్ బాలుడితో వివాహిత సహజీవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Married Woman Illegal Affair With Minor Boy: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 15 బాలుడ్ని ఒక వివాహిత కిడ్నాప్ చేసిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. అందరూ అనుమానించినట్టుగానే ఈ కేసులో షాక్‌కి గురి చేసే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మాయమాటలు చెప్పి ఆ బాలుడ్ని తీసుకెళ్లిన మహిళ.. హైదరాబాద్‌లో అతనితో సహజీవనం చేసినట్టు తేలింది. స్థానికంగా కలకలం రేపిన ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఫోన్ లొకేషన్ ఆధారంగా వివాహితని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..
గుడివాడ పట్టణంలో ఓ వివాహిత మహిళ (31) తన భర్త, నలుగురు పిల్లలతో నివాసముంటోంది. చిన్నారులతో సెల్ ఫోన్‌లో వీడియో గేమ్స్ తరచూ ఆడే ఈ వివాహిత.. ఎదురింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడి పట్ల ఆకర్షితురాలయ్యింది. అతడ్ని శారీరంగా లోబర్చుకుంది. దీంతో.. ఆ అబ్బాయి పాఠశాలకు వెళ్లకుండా తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఇది గమనించిన బాలుడి తల్లిదండ్రులు.. అతడ్ని మందలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ వివాహిత.. ఆ బాలుడు తనకు ఎక్కడ దూరమవుతాడోనన్న భయంతో ఎస్కేప్ ప్లాన్ వేసింది. అతనికి మాయమాటలు చెప్పి.. ఈనెల 19వ తేదీన బలవంతంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లింది. హైదరాబాద్ బాలానగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని.. బాలుడితో సహజీవనం చేస్తోంది.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
తొలుత తమ అబ్బాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఎదురింట్లో ఆ వివాహిత కూడా మాయమైన విషయం తెలియడంతో.. ఆమెనే తమ పిల్లాడ్ని కిడ్నాప్ చేసిందని బాలుడి పేరెంట్స్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్నుంచే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాడు. డబ్బులు లేకపోవడంతో.. తనకు డబ్బులు పంపాలని స్నేహితులు, చుట్టుపక్కల వారికి మెసేజ్ చేశాడు. ఎవరూ స్పందించకపోవడంతో నేరుగా తల్లిదండ్రులకే ఫోన్ చేసి.. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు.
అప్పటికే బాలుడి కోసం కొన్ని ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే బాలుడు ఫోన్ చేసిన విషయం తెలిసి, అతడు మాట్లాడుతున్నప్పుడే సెల్‌ఫోన్ లొకేషన్‌ని పసిగట్టారు. మంగళవారం రాత్రి వారి ఇంటికి వెళ్లి.. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, బుధవారం గుడివాడకు తీసుకొచ్చారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. వివాహితపై కిడ్నాప్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
తాజావార్తలు
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!