Gudivada Amarnath Fires On Undavalli Sridevi Over Cross Voting: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్యే శ్రీదేవిపై మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉండవల్లి శ్రీదేవి అనేదాని కంటే ఊసరవెల్లి శ్రీదేవి అని పేరు మార్చుకుంటే బెటరని సూచించారు. సినీనటి శ్రీదేవి కంటే ఎమ్మెల్యే శ్రీదేవి అద్భుతంగా నటిస్తున్నారని సెటైర్లు వేశారు. ఎన్నికల రోజు ఆమె ఓటు వేసి వచ్చిన తర్వాత తనకు అనుమానం కలిగిందని, అయితే తాను వైసీపీకి ఓటు వేశానని నమ్మించేందుకు శ్రీదేవి నటించిందని మంత్రి పేర్కొన్నారు. ఊసరవెల్లులు అన్నీ కలిసి పెద్ద ఊసర వెల్లి దగ్గరకు చేరుతున్నాయని విమర్శించారు. ఉండవల్లి శ్రీదేవి పసుపు కండువా కప్పుకుని జనంలోకి వెళ్లినప్పుడు.. అసలు సంగతి తెలుస్తుందని చెప్పారు. నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఇప్పుడు ఎలా బయటకు వస్తున్నాయని ప్రశ్నించారు. శ్రీదేవి లాంటి నమ్మకద్రోహుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఓటుకు నోటు ఆఫర్ చేశారని స్వయంగా ఎమ్మెల్యే రాపాక చెప్పాక.. ఇక కొత్తగా చర్చలెందుకు అని ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ సైతం ఎమ్మెల్యే శ్రీదేవిపై ధ్వజమెత్తారు. వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నారని.. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఆయన తీరులో మార్పు లేదని ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో వైసీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ను వన్స్ మోర్ సీఎంగా ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయ్యారన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి నాలుగేళ్ళ తర్వాత కులం గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.
NTR: భయమంటే తెలియని ఎన్టీఆర్ నే భయపెట్టిన మొనగాడు.. ఇతడే.. గుర్తుపట్టారా..?
మరోవైపు.. సస్పెండ్ అయ్యాక మీడియా ముందుకొచ్చిన ఉండవల్లి శ్రీదేవి.. ఎమ్మెల్సీ ఎన్నికల తీరు, పార్టీ నేతల విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మూడు రోజులుగా వైసీపీ గుండాలు తనని వేధిస్తున్నారని, డాక్టర్ సుధాకర్ తరహాలోనే తనని కూడా చంపుతారన్న భయంతో తాను అజ్ఞాతంలో ఉన్నానని బాంబ్ పేల్చారు. తాను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా? లేదా సీసీ కెమెరా పెట్టారా? అని ప్రశ్నించారు. ఇతర అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని, వాళ్ల మీద ఎందుకు అనుమానం పడట్లేదని నిలదీశారు. తనని పిచ్చి కుక్కలాగా నిందవేసి బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ తనయుడి పార్టీ అంటే విలువలతో ఉంటాయనుకున్నానని, కానీ పాలిటిక్స్‌లో ఎలాంటి విలువ లేని రాజకీయాలు ఉంటాయని తాను అనుకోలేదని పేర్కొన్నారు. అమరావతి రైతుల కోసం తాను ప్రాణం పోయేదాకా పోరాటం చేస్తానని ఉద్ఘాటించారు. ‘‘అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దాం.. నేను డబ్బులు తీసుకున్నానని నిరూపించండి’’ అంటూ సవాల్ విసిరారు. తనని పిచ్చి కుక్కతో సమానంగా చూశారని, ఈరోజు నుంచి తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని అని చెప్పుకొచ్చారు. నిన్నటిదాకా తనతో ఉన్నవారే ఇప్పుడు తన ఆఫీస్‌పై దాడి చేశారని భావోద్వేగానికి గురయ్యారు. తనకు ప్రాణహాని ఉందని, తనకేం జరిగినా దానికి సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత వహిస్తాడని చెప్పారు. తాను దళిత ఎమ్మెల్యేని అని, అందుకే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదన్నారు వెల్లడించారు.
Revanth Reddy: రాహుల్ పై వేటు.. కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే..