Andhra Pradesh: చంద్రబాబును కలిసిన గ్రూప్-1 అభ్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం చంద్రబాబును గ్రూప్-1 అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్-1 నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్‌లో 62శాతం వ్యత్యాసం ఉందన్నారు. డిజిటల్ మూల్యాoకానం, మాన్యువల్ మూల్యాంకనంలో 62 శాతం ఫలితాలు తేడా రావటమే అనుమానాలకు బలమిస్తోందని అభ్యర్థులు వాపోయారు.
మాన్యువల్ మూల్యాంకనంలో 80 శాతం తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని గ్రూప్-1 అభ్యర్థులు చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత నిర్వహించిన డిజిటల్ మూల్యాకంనంలో 326 మందిని అర్హులుగా ప్రకటించడంతో పాటు పారదర్శకంగా చేశామని.. హైకోర్టులో ఏపీపీఎస్సీ అఫిడవిట్ దాఖలు చేసిందని.. తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాoకనంలో 62 శాతం మంది డిజిటల్లో అర్హత పొందిన వారిని తొలగించారని వివరించారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,544 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్
అయితే ఈ పక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని ఏపీపీఎస్సీ చెప్తోందని.. డిజిటల్ మూల్యాంకనం లేదా మాన్యువల్ మూల్యాంకనంలో ఏది పారదర్శకంగా ఉందో తేలాలంటే న్యాయ విచారణ జరగాల్సిందేనని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలు హడావుడిగా నిర్వహించడంలో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో ఈ విధంగా హడావుడి ఇంటర్వ్యూల నిర్వహణతో చాలా మంది అభ్యర్థులు నష్టపోతారన్నారు. చంద్రబాబు తమ పోరాటానికి నైతిక మద్దతు ఇవ్వటంతో పాటు న్యాయ పరంగా అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు.
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.