Site icon NTV Telugu

Grama Sarpanch Murder: ద్వారకా తిరుమలలో దారుణం.. సర్పంచ్ హత్య

గ్రామాల్లో  చిన్న చిన్న గొడవలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. దీంతో అక్కడ రెండువర్గాలుగా విడిపోవడంతో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి లో దారుణ హత్య జరిగింది. దీంతో అక్కడ కలకలం రేగింది. వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ ను నరికి చంపారు కొంతమంది దుండగులు. దీంతో ఊరు చివర పడి ఉంది ప్రసాద్ మృత దేహం. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

గ్రామ సర్పంచ్ హత్య విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు గోపాల పురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. ఈ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణం అని ఎమ్మెల్యే పై దాడి చేశారు గ్రామస్తులు. దీంతో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకి గాయాలయ్యాయి. ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకవర్గం ఎమ్మెల్యే తీరుపై మండిపడుతోంది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్ళ దాడికి దిగారు. దీంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Brutal Murder: నరసరావుపేటలో దారుణహత్య 

Exit mobile version