NTV Telugu Site icon

విద్యార్థినికి లైంగిక వేధింపులు.. నెల్లూరు జీజీహెచ్ చీఫ్‌పై వేటు

Nellore GGH

నెల్లూరు జీజీహెచ్ సూప‌రింటెండెంట్ ప్ర‌భాక‌ర్ ఆడియో టేపు లీక్ కావ‌డం పెద్ద క‌ల‌క‌ల‌మే సృష్టించింది.. ఆస్ప‌త్రిలో మ‌హిళా డాక్ట‌ర్ల‌ను, జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ను, సిబ్బందిని లైంగికంగా వేధింపుల‌కు గురిచేస్తార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.. ఓ విద్యార్థిని ఆయ‌న‌కు ఫోస్ చేసి.. న‌న్ను నీ రూమ్‌కి ర‌మ్మంటావా? లేక‌పోతే కాళ్లు చేతులు క‌ట్టి, ప్లాస్ట‌ర్ వేసి తీసుకుపోతానంటావా? అడిగితే ఇదంతా కామ‌న్ అంటావా? అంటూ చెడ‌మా వాయింది.. నా స్థానంలో నీ కూతురు ఉంటే ప‌రిస్థితి ఏంటి? అంటూ నిల‌దీసింది.. ఇక‌, ఈ ఆడియో లీక్ కావ‌డంతో.. సూప‌రింటెండెంట్ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది.. వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించింది.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు… సూపరింటెండెంట్‌పై విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. ఈ క్రమంలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై బదిలీ వేటు వేసింది ప్ర‌భుత్వం… ప్రభాకర్‌ను నెల్లూరు జీజీహెచ్ నుండి తిరుపతి రుయాకి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.