NTV Telugu Site icon

Amaravati Municipality: 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీ..!

Amaravati

Amaravati

గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే.. వైసీపీ సర్కార్‌.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబుతోంది.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.. అయితే, ఏపీ లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా మారనున్న అమరావతిని.. మున్సిపాలిటీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయసేందుకు సిద్ధమైంది.. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నట్టు సమాచారం.. ఈ మేరకు, గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది… ప్రభుత్వ ఆదేశాలతో గ్రామసభలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.

Read Also: Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు..

అమరావతి మున్సిపాలిటీపై గ్రామపంచాయతీల అభ్యంతరాలు తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు కలెక్టర్‌.. గతంలో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌ పేరుతో గ్రామసభలు జరగగా.. 22 గ్రామాలతో కార్పొరేషన్‌ ప్రతిపాదనను తిరస్కరించారు ప్రజలు.. 29గ్రామాలతో కూడిన కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.. అయితే, వాటిని పక్కనపెట్టి.. ఇప్పుడు 22 గ్రామాలతో మున్సిపాలిటి ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని.. ఆయా గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్‌.