Site icon NTV Telugu

Goshala at CM YS Jagan House: సీఎం జగన్‌ నివాసంలో ప్రత్యేక గోశాల.. నిత్య పూజలు..!

Goshala

Goshala

Goshala at CM YS Jagan House: తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాసం దగ్గర ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. హైందవ సంస్కృతితో గో పూజకు ప్రత్యేక స్థానం ఉండగా.. సీఎం నివాసంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు అయ్యింది.. తెలుగుతనం ఉట్టిపడే డిజైన్లతో ఈ గోశాలను రూపకల్పన చేశారు.. గోవులు, గో పూజ అంటే ప్రత్యేక ఆసక్తి చూపించే ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి.. రేపు గోపూజలు పాల్గొనబోతున్నారు.. ముఖ్యమంత్రి జగన్ గోశాలలో పలు రకాలకు చెందిన గోవులను తీసుకొచ్చారు.. గిరి, పుంగనూరు, కపిల, హర్యానా ప్రాంతాలకు చెందిన గోవులను గోశాలలో ఉంచారు.. గోశాలలో నిత్య పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు.. ఇక, గోశాలలోని గోవులకు ప్రత్యేక పేర్లు పెట్టారు సీఎం సతీమణి వైఎస్‌ భారతి.. గోవుల ఆరోగ్యం చూసుకోవటానికి ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు.

Read Also: 90Days Validity Best Plans : ప్రతీ నెలా రీఛార్జ్ వద్దనుకుంటే.. ది బెస్ట్ 90డేస్ ప్లాన్స్ ఇవే

ఇక, రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం అయ్యాయి.. రేపు తన నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకోబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. సతీసమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఇప్పటికే పల్లె వాతావరణం కనిపిస్తోంది.. ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపాలు, తెలుగు తనం, పల్లె పట్టు వాతావరణం కనువిందు చేస్తున్నాయి.. ముద్ద బంతులు, చామంతులు, పాడి పంటలతో సంక్రాంతి సోయగం సంతరించుకుంది ముఖ్యమంత్రి గోశాల.. సతీసమేతంగా గోపూజ అనంతరం భోగి మంటలు, సంక్రాంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు సీఎం దంపతులు.. ఉదయం పది గంటలకు ఈ వేడుకలు ప్రారంభంకాబోతున్నాయి.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి..

Exit mobile version