Site icon NTV Telugu

Gorantla Madhav: ఆ వీడియోపై నేను ప్రమాణం చేస్తా.. చంద్రబాబు కూడా ప్రమాణం చేస్తారా?

Gorantla Madhav

Gorantla Madhav

Gorantla Madhav: తన వీడియో ఫేక్ వీడియో అని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే నిజమని తేలిందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్టుతో మరోసారి టీడీపీ దొరికిపోయిందని.. అమెరికా నుంచి ఓ ఫేక్ రిపోర్ట్ తెప్పించారని.. ఈ రిపోర్టుతో చంద్రబాబు నానా యాగీ చేశారని ఆరోపించారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ అక్కడి నుంచి తెప్పించిన వివరాలతో టీడీపీ పరిస్థితి కుడితిలో పడిన బల్లి లాగా తయారైందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు గురించి కొన్ని మీడియా సంస్థలు ఏనాడైనా చర్చకు పెట్టాయా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికి తెలుకుట్టిన బల్లిలా చంద్రబాబు పారిపోయి వచ్చాడని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. తన వీడియోపై చంద్రబాబు ఇంతగా తైతక్కలాట ఆడాల్సిన అవసరం లేదని.. ఓటుకు నోటు వీడియో తనది కాదు అని కాణిపాకం వినాయకుడి దగ్గర చంద్రబాబు ప్రమాణం చేస్తే.. తాను కూడా ప్రమాణం చేస్తానని.. తన రాజీనామాను ఆయన ముఖాన కొడతానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.

Read Also: Pawan Kalyan: ఇదేం భక్తి అండీ బాబు.. పవన్ కోసం పవన్ మాల వేసుకున్న అభిమానులు

పబ్లిక్ మీటింగ్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి.. కడుపు అయినా చేయాలని చెబితే ఏ రోజు అయినా చర్చకు పెట్టారా అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. లోకేష్ మహిళలతో ఏ రకంగా నిస్సిగ్గుగా ఫోటోల్లో ఉన్నాడో కూడా చర్చ చేపట్టాలన్నారు. టీడీపీ బీసీ సోదరులు ఈ విషయాలపై నిలదీయాలని సూచించారు. చంద్రబాబు అధికారలోకి రావాలని ఫేక్ వీడియోతో నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఫేక్ వీడియో, ఫేక్ సర్టిఫికెట్‌తో ఆనంద పడ్డారని.. కానీ చివరికి న్యాయం, ధర్మం, చట్టం గెలుస్తాయని.. విజేతను తానేనని గోరంట్ల మాధవ్ తెలిపారు. తన వీడియో అంశంపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశానని.. న్యాయపరమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు.

Exit mobile version