NTV Telugu Site icon

శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త

Srisailam

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. కరోనా మహమ్మారి కారణంగా స్పర్శ దర్శనం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే కాగా.. దసరా మహోత్సవాల ప్రారంభం నుంచి తిరిగి.. సామాన్య భక్తులకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది శ్రీశైలం దేవస్థానం.. అంటే, అక్టోబర్‌ 7వ తేదీ నుంచి భక్తులందరికీ స్పర్శ దర్శనం అవకాశం ఇవ్వనున్నట్లు టెంపుల్‌ అధికారులు పేర్కొన్నారు. కాగా, వారంలో 4 రోజుల పాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు సర్వదర్శనం క్యూలైన్‌ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించేవారు అధికారులు… ఇక, సామాన్య భక్తులకు సైతం స్వామివారి స్పర్శ దర్శన కల్పించాలనే ఉద్దేశంతో 4 రోజుల పాటు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30గంటల వరకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.