శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు అధికారులు.. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో మార్పులు చేసుకోగా.. ఈ నెల 18 నుంచి స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఈవో కేఎస్ రామారావు ప్రకటించారు.. ఇక, ప్రతిరోజు గర్భాలయంలో ఏడు విడతలుగా అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. కోవిడ్ నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయని పేర్కొన్నారు.. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు ఈవో.. అయితే, స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
Srisailam