NTV Telugu Site icon

Good News: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. నేటినుంచే సర్కారు బడుల్లో కొత్త మెనూ

Food

Food

ఏపీలో విద్యార్ధులకు శుభవార్త వినిపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Cm Jaganmohan Reddy).నేటినుంచి విద్యార్థులకు పోషకవిలువలతో కూడిన భోజనం అందనుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ‘ గోరుముద్ద ‘ను ప్రభుత్వం వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

Read Also: Cm Jagan Tour: నర్సాపురంలో జగన్ పర్యటన.. భారీ బందోబస్తు

మెనూ ఎలా అమలుచేస్తారంటే..

సోమవారం : ప్రస్తుత మెనూ: అన్నం, పప్పుచారు, కోడిగుడ్డుకూర, చిక్కీ

కొత్తమెనూ : హాట్‌పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/ కూరగాయల పులావ్, కోడిగుడ్డుకూర, చిక్కీ

మంగళవారం : ప్రస్తుతం: చింతపండు/నిమ్మకాయ పులిహోర,టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు

కొత్తమెనూ: చింతపడు/నిమ్మకాయ పులిహోరా, టమాట పచ్చడి/దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు

బుధవారం : ప్రస్తుతం: కూరగాయల అన్నం, బంగళాదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ

కొత్తమెనూ: కూరగాయల అన్నం, బంగాళదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ

గురువారం : ప్రస్తుతం: కిచిడి, టమాటపచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు

కొత్తమెనూ: సాంబార్‌బాత్, ఉడికించిన కోడిగుడ్డు

శుక్రవారం : ప్రస్తుతం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ

కొత్తమెనూ: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ

శనివారం : ప్రస్తుత మెనూ: అన్నం, సాంబార్, తీపిపొంగలి

కొత్తమెనూ: ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపిపొంగలి మెనూగా అందించనున్నారు.

Read Also: AP Aqua University: నెరవేరనున్న కల..నర్సాపురంలో ఏపీ ఆక్వా యూనివర్శిటీ