Golden Temple in Sea: తుఫాను తెచ్చిన బంగారు మందిరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసని తుఫాను వల్ల తీరప్రాంతం అలజడిగా వుంది. అక్కడక్కడా భారీవర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాను కారణంగా ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. అసని తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రథంగా దీనిని భావిస్తున్నారు.
అసాని తుపాన్ ప్రభావంతో ఇది సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అక్కడి ప్రజలు వీక్షించేందుకు ఎగబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడూ చూడని వింతైన రథం మంగళవారం కొట్టుకు వచ్చింది.ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాష లో లిఖించి వుంది. ఇది మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదంటున్నారు. దీనిని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అది ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనే విషయం తెలియాల్సి ఉంది. బంగారం రంగులో ఉన్న రథం తమ తీరానికి కొట్టుకురావడంతో స్థానికులకు వింత అనుభూతికి లోనవుతున్నారు.
Also Read
తీవ్రతుఫాను నుంచి తుఫానుగా బలహీనపడింది అసని. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది తుఫాను. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 550 కి.మీ., పూరీకి 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం వుందంటోంది వాతావరణ శాఖ. ఆతర్వాత ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం వుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!