Site icon NTV Telugu

గోదావరి నది యాజమాన్య బోర్డు అత్యవసర సమావేశం..!

GRMB

GRMB

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కృష్ణ నది జలాలతో పాటు.. గోదావరి జలాల విషయంలోనూ కొన్ని వివాదాలు ఉండగా… ఈ వివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో… రెండు బోర్డుల అధికారాలు, పరిధిలను నిర్ణయిస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ఈనెల 9వ తేదీన గోదావరి నది యాజమాన్య బోర్డు పూర్తిస్థాయి అత్యవసర సమావేశం జరగనుంది… కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ప్రధానంగా చర్చించనుంది బోర్డు.. ఇక, బుధవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ అధికారుల గైర్హాజరు నేపథ్యంలో.. పూర్తిస్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని జీఆర్‌ఎంబీ నిర్ణయించింది.

Exit mobile version